రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 69 శాతం మేర 8వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 5.7 లక్షల మంది విద్యార్ధులకుగానూ 3.96 లక్షల మంది విద్యార్ధులు హాజరైనట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటలో వెల్లడించారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 తరగతికి చెందిన విద్యార్ధులు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తొలిరోజు 69 శాతం మంది విద్యార్ధులు హాజరైనట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక 46.2 శాతం మంది పదో తరగతి విద్యార్ధులు, 41.6 శాతం మంది 9వ తరగతి విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ పేర్కొంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 82 శాతం, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 53 శాతం నమోదైనట్లు వెల్లడించింది.
ఇదీ చదవండిట