Auto stunts: ఆటోలతో రోడ్డుపై స్టంట్లు చేస్తూ.. ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24 అర్ధరాత్రి సమయంలో బాబానగర్ చాంద్రాయణగుట్ట రోడ్డుపై 3 ఆటోలు ప్రమాదకరంగా నడుపుతూ.. స్టంట్‌లు చేశారు.
ఆటో నెంబర్‌ల ఆధారంగా ఆటోలు నడిపిన ఏడుగురిని పోలీసులు గుర్తించారు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అతివేగంతో నడుపుతూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తే.. చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: