- 'సీబీఐ విచారణ జరపాలి'
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 15నెలల్లో 150కిపైగా దాడులు, 4హత్యలు, 2శిరోముండనాలతో దమనకాండ సాగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నారు'
సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోటస్‌పాండ్ వేదికగా... హిందూమతంపై విషం చిమ్మే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరో ఏడాదిపాటు నిషేధం
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ, కార్యకలాపాలపై మరో ఏడాదిపాటు ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాదిపాటు నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విషాదం
కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాజ్‌నాథ్ సమీక్ష
భారత్-చైనా విదేశాంగ మంత్రుల భేటీ జరిగిన ఒక రోజు తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. సైనికాధికారులతో సరిహద్దు ఉద్రిక్తతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి బిపిన్ రావత్, మూడు దళాలకు చెందిన అధిపతులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పరీక్షలు చేయించుకుంటేనే'
పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. నెగెటివ్ వచ్చినవారికే పార్లమెంటు ఆవరణలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తాలిబన్ల ఘాతుకం
అఫ్గాన్‌లో తాలిబన్లు జరిపిన దాడిలో 16 మంది సైనికులు అమరులయ్యారు. ప్రభుత్వ చెక్‌పోస్టులు లక్ష్యంగా జరిగిన ఈ కాల్పుల్లో మరికొందరు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన పసిడి ధర
పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.191 తగ్గి.. రూ.52,452 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఐపీఎల్ బజ్
ఐపీఎల్ కోసం జట్లన్నీ యూఏఈ చేరుకుని సన్నాహకాలు ప్రారంభించాయి. ఆటగాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్టింట పోస్టు చేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మీ ప్రభుత్వం వేధిస్తోంది'
మహారాష్ట్ర ప్రభుత్వానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే శినసేన పార్టీని విమర్శిస్తూ పలు పోస్టులు పెడుతోంది కంగన. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ విషయంలో సూటిగా ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.