ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM
author img

By

Published : Jul 8, 2022, 5:03 PM IST

  • ఎంపీ రఘురామ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
    Telangana High Court dismissed MP Raghurama quash petition: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన క్వాష్​ పిటిషన్​ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో హైదరాబాద్​ గచ్చిబౌలి పీఎస్‌లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని రఘురామ పిటిషన్ వేశారు. రఘురామ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్​ను కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మంచి డిమాండ్​ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించండి'
    Farmers Day Celebrations in Guntur: మంచి డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాయంలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రైతు దినోత్సవం కాదు.. రైతు ద్రోహి దినోత్సవం: తెదేపా
    TDP on YSRCP Plenary: సీఎం జగన్ మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేశారని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. ఇది రైతు దినోత్సవం కాదని.. రైతు ద్రోహి దినోత్సవం అని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు
    Focus on Corona: విశాఖ జిల్లాలో మూడు రోజులుగా కరోనా కేసులు 100కు పైగా నమోదయ్యాయి. అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు.. పరీక్షా కేంద్రాల్ని అదనంగా ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో అదనపు పడకల ఏర్పాటుతో.. ముందస్తుగా సన్నద్ధమైనట్లు డీఎంహెచ్​వో విజయలక్ష్మి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీఎం భార్య ట్విట్టర్​ ఖాతా బ్లాక్​​.. పెళ్లైన మరుసటి రోజే.. కారణమిదే...
    Gurpreet Kaur Twitter: పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ భార్య.. డాక్టర్​ గురుప్రీత్​ కౌర్​(32) ట్విట్టర్​ ఖాతాను నిలిపివేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం. గురువారమే చండీగఢ్​లోని మాన్​ నివాసంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మరుసటి రోజే ఇలా జరగడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం.. వెంకయ్య కీలక సూచనలు
    Rajya Sabha members oath: పది రాష్ట్రాలకు చెందిన 27 మంది రాజ్యసభ సభ్యులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎగువ సభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు వారిచేత ప్రమాణం చేయించారు. వారిలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్​, పీయూష్​ గోయల్​ తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య
    జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • త్వరపడండి.. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు తరుణమిదే!
    ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను జులై 31వ తేదీలోగా సమర్పించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల ఎలాంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది? రిటర్నుల దాఖలులో పొరపాటు జరిగితే ఏమవుతోంది? విధిగా పన్ను కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ganguly: 'దాదా'@50.. 'ఫియర్ లెస్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌' ​​
    Ganguly Birthday: దాదా.. క్రికెట్​ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. గంగూలీ రాకతో టీమ్‌ఇండియాకు 'ఫియర్ లెస్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌' పరిచయమైంది. ఎవరూ ఊహించని విధంగా భారత క్రికెట్‌ శైలినే మార్చేశాడు. టాలెంట్‌ గుర్తించి యువకులను ప్రోత్సహించాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, ఎంఎస్‌ ధోనీ, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్ లాంటి వారిని స్టార్లుగా తీర్చిదిద్దాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హీరో చియాన్​ విక్రమ్​కు గుండెపోటు!
    Hero Chiyan Vikram Heart Attack: ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని కుటుంబసభ్యులు, ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.