- కొత్త మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ తుది కసరత్తు.. జాబితా ఎప్పుడంటే?
కొత్త మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్ తుది కసరస్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు సజ్జలతో మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ చర్చించారు. ఈనెల 11న ఉదయం 11గంటల 31 నిమిషాలకు మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది. అదివారం సాయంత్రానికి అధికారికంగా కొత్త మంత్రులకు లేఖలు వెళ్లవొచ్చని తెలుస్తోంది.
- వైకాపాలో లీడర్ నుంచి కేడర్ వరకూ.. ఓటమి భయం: అచ్చెన్నాయుడు
అధికార పార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపాలో లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు.
- 'నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఒక్కరోజు విరామం'
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఉంది.. భవన నిర్మాణ రంగ పరిస్థితి. కరోనా కారణంగా నత్తనడకన నడుస్తున్న ఈ రంగాన్ని.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు.
- లైంగికంగా వేధించాడని.. కార్పొరేషన్ అధికారిపై చర్యలు
Suspension: మహిళపై లైంగిక వేధింపుల దృష్ట్యా విజయనగరం కార్పొరేషన్ శానిటరీ అధికారి త్రినాథ్‌ను విధుల నుంచి తొలగించారు. మహిళను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మేయర్, కమిషనర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు విజయనగరం ప్రజారోగ్య అధికారి తెలిపారు.
- Rahul Gandhi: 'అధికారంలోనే పుట్టాను.. దానిపై ఆసక్తి లేదు'
Rahul Gandhi: తాను అధికారంలోనే పుట్టానని, దానిపై తనకెప్పుడూ ఆసక్తి లేదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఆధికారం కోసం తాపత్రయపడతూ ఉంటారని విమర్శించారు.
- బాలికపై ఎనిమిది మంది అత్యాచారం.. వీడియోలు తీసి..!
Bangalore Girl Gang Rape: ఓ బాలిక(16)పై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో పబ్లిక్ టాయిలెట్లో బాలిక(13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు.
- బస్సును ఢీకొట్టిన బైక్.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం
కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని హంపన్‌కట్ట సిగ్నల్ వద్ద ఓ బస్సును, బైక్ ఢీకొట్టింది. హంపన్‌కట్ట సిగ్నల్‌ను బస్ దాటుతున్న సమయంలో వలెన్సియా వైపు వెళ్తున్న బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో.. మంటలు చెలరేగి రెండు వాహనాలూ దగ్ధమయ్యాయి.
- ఇవి పాటిస్తే ఆర్థిక ఒత్తిడి దూరం..
financial stress avoid plans: ఆరోగ్యమే మహా భాగ్యం అనే మాట వింటూనే ఉంటాం. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ డబ్బు అవసరం ఎంతో ఉంది. ఆర్థికారోగ్యం బాగున్నప్పుడే.. అనుకున్నవన్నీ సాధించగలం. క్రమం తప్పని వైద్య పరీక్షలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లే.. మన ఆర్థిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమూ అవసరం.
- రవిశాస్త్రి సీరియస్.. అతడిపై జీవితకాల నిషేధం విధించాలని..!
Ravi Shastri on Chahal Incident: ఐపీఎల్ తొలినాళ్లలో ముంబయి ఇండియన్స్‌కు ఆడేటప్పుడు చాహల్‌కు ఎదురైన ఘటనపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆ నేరానికి పాల్పడిన క్రికెటర్‌ను మైదానానికి సమీపంలోకి కూడా రానివ్వొద్దని అన్నాడు.
- స్టార్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. ఎన్ని కోట్ల సొమ్ము పోయిందంటే?
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరగ్గా.. పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు.