- న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్
ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన రాజధాని బిల్లులపై... రాజ్ భవన్ న్యాయసలహాలు తీసుకుంటుంది. సీనియర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు అందగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అవమానంతో ఆత్మహత్య
అనంతపురం జిల్లా ముప్పలకుంటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చిందంటూ గ్రామస్థులు అవహేళన చేశారు. గ్రామం విడిచి వెళ్లాలంటూ గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్
రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పగలే నగల దుకాణంలో చోరీ
విజయవాడ కాటూరి వారి వీధిలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడి జరిగింది. షాపు గుమాస్తా కాళ్లు, చేతులు కట్టేసి సుమారు ఏడు కేజీల బంగారం, 30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నా భర్తను నేనే కాల్చి చంపేదానిని'
ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్కౌంటర్ చేయకపోతే... తానే కాల్చి చంపేదానినని అన్నారు అతడి భార్య రిచా. వికాస్ మానసిక స్థితి గురించి కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సరైన సమయంలో షెడ్యూల్
కరోనా కారణంగా వాయిదా పడిన ఉపఎన్నికల నిర్వహణ తేదీలను సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే మొత్తం 57 స్థానాలకు షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా ఓ లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- డోక్లాం కోసం చైనా ఆరాటం!
భారత్‌తో పరోక్ష దౌత్య యుద్ధానికి చైనా తెరతీసింది. భారత్‌తో సన్నిహిత సంబంధాలున్న దేశాలను మభ్యపెడుతోంది. తాజాగా తన దృష్టిని భూటాన్పైకి మళ్లించింది. దౌత్యపరమైన సంబంధాలు ఏర్పర్చుకునేలా భూటాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇకపై 'ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్'
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. హోల్ సేల్ వ్యాపారల సంస్థ వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసింది. భారత్‌లో హోల్ సేల్ వ్యాపారాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ కొనుగోలు జరిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సమయం ఆసన్నమైంది
కరోనా సంక్షోభ సమయంలోనూ ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్లు విజ్డెన్ ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1-1తో సిరీస్ సమం కాగా.. నేడు ప్రారంభమైన నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలిచిన జట్టు వద్ద ట్రోఫీ ఉండనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఇవి నేర్చుకోండి'
విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విద్యాబాలన్. తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి బయోపిక్‌లో నటించారు. ఈనెల 31న ఈ చిత్రం విడుదలవుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.