తెలంగాణలో కొత్తగా 5,559 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ బారినుంచి మరో 8,061 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 71,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు సాయంత్రం ఐదున్నర గంటల వరకు వివరాలను ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇవాళ్టి నుంచి రోజూ సాయంత్రం 6 గంటలకు కరోనా బులిటెన్ విడుదల చేస్తామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 984 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 457, మేడ్చల్ జిల్లాలో 372, వరంగల్ అర్బన్ జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 208, కరీంనగర్ 201, ఖమ్మంలో 200 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి: టీకా విధానం రద్దు కోసం సుప్రీంకు బంగాల్ సర్కారు
దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 81.9 ఉండగా.. రాష్ట్రంలో 84.81గా ఉంది. దేశంలో మరణాల రేటు 1.1 ఉండగా.. రాష్ట్రంలో 0.54గా ఉందని బులిటెన్‌లో వివరించారు. రాష్ట్రంలో అన్ని రకాల పడకలు కలిపి 53,528 అందుబాటులో ఉన్నాయి. 28,170 పడకలు రోగులకు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 66 శాతం ఆక్సిజన్ పడకలపై రోగులు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 73 శాతం ఐసీయూ పడకలు రోగులతో ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: