మలేసియాలోని కౌలాలంపూర్‌లో చిక్కుకుపోయిన 53 మంది ఏపీ వాసులు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మార్చి 18న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర విదేశాంగశాఖకు లేఖ రాశారు. దీనికి కౌలాలంపూర్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ అర్చనా నాయర్ బదులిస్తూ లేఖ రాశారు. కరోనా విస్తృతి దృష్ట్యా మలేసియా నుంచి వచ్చే ప్రయాణికుల రాకపై భారత్ ఆంక్షలు విధించినట్లు లేఖలో వివరించారు. ఈ సందర్భంగా మలేసియాలోని తెలుగు ప్రజలు +60183196715 నంబరును సంప్రదించాలని సూచించారు.
53 మంది ఏపీ వాసులు సురక్షితం - Telugu people stuck in Malaysia
మలేసియాలోని కౌలాలంపూర్‌లో చిక్కుకుపోయిన 53 మంది ఏపీ వాసుల గురించి కేంద్ర విదేశాంగ శాఖకు చంద్రబాబు లేఖ రాశారు. వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై స్పందించిన అక్కడి భారత రాయబార కార్యాలయం 53 మంది ఏపీ వాసులు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది.