కరోనా ప్రభావం రైల్వేశాఖపై పడింది. వైరస్ ప్రభావంతో అత్యధిక శాతం ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా రైల్వే ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దుచేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 45 రైళ్లలో ఆక్యుపెన్సీ వల్ల రద్దు చేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఈనెల 20 నుంచి 31 వరకు వివిధ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దైన రైళ్ల వివరాలు...
- తిరుపతి- కెఎస్ఆర్ బెంగళూరు (ఎగువ, దిగువ)
- యశ్వంత్పూర్- కాచిగూడ (ఎగువ, దిగువ)
- ముంబయి ఎల్టీటీ- అజ్నీ (ఎగువ, దిగువ),
- ముంబాయి ఎల్టీటీ- కరీంనగర్ (ఎగువ, దిగువ)
- ముంబాయి సీఎస్టీ- నాగపూర్ (ఎగువ, దిగువ)
- కాలబుర్గి (గుల్బర్గ)- హైదరాబాద్ (ఎగువ, దిగువ)
- చెన్నై- సికింద్రాబాద్ (ఎగువ, దిగువ)
- సంత్రగచ్చి- చెన్నై (ఎగువ, దిగువ)
- కాకినాడ టౌన్- లింగంపల్లి( ఎగువ, దిగువ)
- మచిలీపట్నం-సికింద్రాబాద్ (ఎగువ, దిగువ)
- హైదరాబాద్- ఎర్నాకుళం (ఎగువ, దిగువ)
- హైదరాబాద్- విజయవాడ
- తిరుచురాపల్లి- హైదరాబాద్ (ఎగువ, దిగువ)
- హెచ్ఎస్ నాందేడ్- ఔరంగాబాద్ (ఎగువ, దిగువ)
- ఔరంగాబాద్-రేణిగుంట (ఎగువ, దిగువ)
- తిరుపతి- చెన్నై సెంట్రల్ (ఎగువ, దిగువ)
- కాన్పూర్ సెంట్రల్- కాచిగూడ (ఎగువ, దిగువ) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఏసీ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న వారూ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. మూడంకెల్లో ఉన్న రిజర్వేషన్లు రెండంకెలకు పడిపోయాయి. ఇప్పటికే ఏసీ రైళ్లలో దుప్పట్ల పంపిణీ నిలిపేశామని.. కనీస ఉష్ణోగ్రత కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. రైళ్లు, రైళ్ల లోపల ప్రాంతాలు, స్టేషన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో థర్మల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: