- " class="align-text-top noRightClick twitterSection" data="">
- కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల బదిలీలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లలో బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అలజడులు సృష్టించారు: అశోక్‌గజపతిరాజు
రెండేళ్ల కాలంలో ఎన్నో అలజడులు సృష్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. మాన్సాస్ సంస్థలోనూ నష్టాలు జరిగాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుడే స్పందిస్తాం: మంత్రి వెల్లంపల్లి
మాన్సాస్ ట్రస్టు(mansas trust) విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం..
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే.. కొందరు అడ్డుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. నేడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బూస్టర్ డోస్‌పై పరిశోధనలు'
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరమా? అన్న విషయంపై ప్రపంచ దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని ఎయిమ్స్ సీనియర్ వైద్యులు తెలిపారు. రెండు, మూడు నెలల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. కేసులు తగ్గినా.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం కీలక తీర్పు
కేరళ మత్స్యకారులను చంపిన ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాదళ అధికారులపై నమోదైన క్రిమినల్ కేసు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్ సహా కేసు విచారణను రద్దుచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రులకు నయా 'రూల్'
ప్రతీ మంత్రికి.. ఎమ్మెల్యేలతో కూడిన బృందాన్ని అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ప్రతీ 2,4 మంగళవారాల్లో వారందరూ కలిసి భోజనాలు చేసి.. స్థానిక ప్రజల సమస్యలను మంత్రులకు వివరించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పేలిన విమానం టైర్
కర్ణాటకలో ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది. కన్నూర్ నుంచి హుబ్లీ మధ్య నడిచే ఇండిగో 6ఈ-7979 విమానం.. హుబ్లీ ఏయిర్‌పోర్టులో ల్యాండ్ అవడానికి ముందు టైర్ పేలిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'స్వింగ్ రాబట్టొచ్చు!'
లాలాజలం(saliva) వాడకుండానే బంతితో స్వింగ్ రాబట్టొచ్చని అంటున్నాడు టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma). అలా జరగాలంటే బంతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకర్ని నియమించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రిలీజ్ డేట్ ఫిక్స్
'బెల్ బాటమ్' సినిమా థియేటర్లోనే విడుదలవుతుందని స్పష్టం చేసారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్. జులై 27న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.