పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు 330వ రోజు ఆందోళనలను కొనసాగించారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులు దీక్షలు చేపట్టి...అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసనను తెలియజేశారు.
తుళ్లూరులో మహిళలు భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తూ నిరసనను తెలిపారు. వెంకటపాలెంలో అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక నాయకులు రైతుల దీక్షకు మద్దతు ప్రకటించారు. కృష్ణాయపాలెంలో మహిళా ఐకాస నేతలు సంఘీభావం తెలిపారు. గతేడాది క్రిస్మస్ నుంచి అన్ని పండగలు... శిబిరాల్లోనే చేసుకున్నామని....ఈ దీపావళి సైతం ఇక్కడే నిర్వహించుకుంటామని మహిళలు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక పండుగలన్నీ రోడ్డుపైనే చేసుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోయారు.
ఇదీ చదవండి:
ఆరేళ్లుగా అగచాట్లు.. ఈటీవీ-ఈటీవీ భారత్ కథనంతో తీరిన ఇక్కట్లు