ETV Bharat / city

పాలన వికేంద్రీకరణ బిల్లు... ఆది నుంచి ఆమోదం వరకు..!

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ఏర్పాటుతోపాటు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన... ఆ బిల్లులు ప్రవేశపెట్టిన విధానం, అప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై శాసనసభ కార్యదర్శి నుంచి నివేదిక తెప్పించుకున్నారు. దిల్లీలోని న్యాయ నిపుణుల్నీ సంప్రదించారు. దాదాపు రెండు వారాల కసరత్తు తర్వాత ఆ బిల్లుల్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

3-capital-and-crda-cancelled-bill-approved-by-governor-biswabhusan
పాలన వికేంద్రీకరణ బిల్లు... ఆది నుంచి ఆమోదం వరకు..!
author img

By

Published : Jul 31, 2020, 5:14 PM IST

Updated : Jul 31, 2020, 10:58 PM IST

పాలన వికేంద్రీకరణ బిల్లు... ఆది నుంచి ఆమోదం వరకు..!

మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను జులై 18న గవర్నర్‌ ఆమోదం కోసం శాసనసభ కార్యదర్శి రాజ్‌భవన్‌కు పంపించారు. వాటిని ఆమోదించవద్దని రాజధాని రైతులు, అమరావతి ఐక్యకార్యాచరణ సమితితో పాటు, ప్రధాన ప్రతిపక్షం తెదేపా సహా పలు రాజకీయ పార్టీలు గవర్నర్‌ను కోరాయి. వాటిపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయని, వాటిని సెలక్ట్‌ కమిటీకి పంపించాలని శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశించారని గవర్నర్‌ దృష్టికి తెచ్చాయి. ఆ బిల్లులు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని, వాటిపై నిర్ణయం తీసుకునే ముందు అటార్నీ జనరల్‌ సలహా తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఆ బిల్లులు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయో లేదో పరిశీలించాల్సిందిగా న్యాయశాఖకు గవర్నర్‌ పంపించారు. అక్కడి నుంచి మళ్లీ అవి గవర్నర్‌కు చేరాయి. వాటిపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. చివరకు బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదించారు.

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ... శాసనసభలో మెజార్టీ ఉండటంతో బిల్లుల్ని ఆమోదింపజేసుకుంది. అక్కడినుంచి అవి శాసన మండలికి వచ్చాయి. అక్కడ వాటిని ప్రవేశపెట్టినప్పుడు దాదాపుగా మంత్రులంతా శాసనమండలిలో ఉన్నారు. మండలిలో మెజార్టీ ఉన్న తెదేపా ఆ బిల్లుల్ని వ్యతిరేకించింది. వాటిని సెలక్ట్‌ కమిటీకి పంపించాలని కోరింది.

తీవ్ర గందరగోళం, నాటకీయ పరిణామాల మధ్య... ఆ బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్టుగా మండలి ఛైర్మన్‌ ప్రకటించారు. సెలక్ట్‌ కమిటీలను నియమించాల్సిందిగా ఛైర్మన్‌ ఇచ్చిన ఆదేశాల్ని శాసనసభ కార్యదర్శి పాటించలేదు. ఆ వ్యవహారం అలా ఉండగానే... జూన్‌ 17న ఆ బిల్లుల్ని మరోసారి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అదే రోజు మళ్లీ శాసనమండలికి పంపింది. అక్కడ ఆ బిల్లులు ప్రవేశపెట్టకుండానే సభ వాయిదా పడింది. బిల్లులు రెండోసారి శాసనమండలికి వెళ్లాక, అక్కడ ప్రవేశ పెట్టకపోయినా నెల రోజుల్లో ఆమోదం పొందినట్టేనన్న నిబంధన మేరకు... జులై 18న వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం శాసనసభ కార్యదర్శి పంపించారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణ పనుల్ని నిలిపివేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై సిఫారసులు చేసేందుకంటూ... 2019 సెప్టెంబరు 13న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు సారథ్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను సమర్పించకముందే ముఖ్యమంత్రి జగన్‌ డిసెంబర్ 18న శాసనసభలో మొదటిసారి మూడు రాజధానుల ప్రతిపాదనను సూచన ప్రాయంగా బయటపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై అధ్యయనానికి బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ని నియమించినట్టు ఆయనే శాసనసభలో తెలిపారు. అప్పటి వరకు ఆ గ్రూప్‌ అధ్యయనం చేస్తున్నట్టుగా సంబంధిత మంత్రులు, అధికార వర్గాలకు తప్ప మరెవరికీ తెలియదు.

ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ల నివేదికలు వచ్చాయి. ఆ రెండు నివేదికలూ మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుగుణంగానే ఉన్నాయి. వాటిపై మంత్రులు, అధికారులతో మరో హైలెవెల్‌ కటీని నియమించారు. ఆ కమిటీ కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపింది. శాసనసభలో ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన మర్నాటి నుంచీ... రాజధాని ప్రాంత ప్రజలు, అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు వారి పోరాటానికి మద్దతిచ్చాయి. రాజధాని ప్రజల పోరాటం ఇప్పటికీ నిరాఘాటంగా కొనసాగుతోంది.

జి.ఎన్‌.రావు కమిటీ, మంత్రుల కమిటీల నియామకాన్ని, మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సవాల్‌ చేస్తూ... హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపించాలని శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశించిన తర్వాత కూడా దానికి విరుద్ధంగా ఆ బిల్లుల్ని మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ మరో వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం అవన్నీ విచారణలో ఉన్నాయి. ఆ బిల్లులు సెలక్ట్‌ కమిటీ వద్ద ఉన్నాయని ఒక సందర్భంలో అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకి తెలిపారు. మధ్యలో సచివాలయంలో తగినంత చోటు లేదన్న కారణంలో విజిలెన్స్‌ కమిషన్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపైనా హైకోర్టు స్టే ఇచ్చింది.

ఇదీ చదవండీ... ఎస్​ఈసీగా నిమ్మగడ్డ​ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Last Updated : Jul 31, 2020, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.