ETV Bharat / city

చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష - విజయవాడ వార్తలు

హైదరాబాద్​ నగరంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ లారీ డ్రైవర్​కు కోర్టు త్వరితగతిన శిక్ష విధించింది. 20 ఏళ్ల శిక్షతో పాటు ఇరవై వేల రూపాయలు జరిమానా విధించింది.

crime news
నిందితుడికి జైలు శిక్ష
author img

By

Published : Apr 26, 2021, 10:57 PM IST

హైదరాబాద్ నగరంలో ఓ చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి పోలీసులు అతి తక్కువ సమయంలోనే జైలు శిక్ష పడేలా చేశారు. చిన్నారులపై దారుణాలకు పాల్పడితే ఊచలు లెక్కించక తప్పదని రుజువుచేసినట్లయింది. కేసు నమోదైన తేదీ నుంచి కేవలం నాలుగున్నర నెలల అతి తక్కువ సమయంలో పొక్సో కేసులో నిందితుడికి 20 జైలు శిక్షతోపాటు 25వేల రూపాయల జరిమానా పడేలా బంజారాహిల్స్‌ పోలీసులు చేశారు.

ఫిలింనగర్‌ లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఏనెగంటి చెన్నయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతను గత డిసెంబర్ నెలలో స్థానికంగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డీఐ హఫీజుద్దీన్, సెక్టార్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ రవిరాజ్‌లు పకడ్బందిగా దర్యాప్తు చేసి కేవలం నెలన్నర రోజులలోనే.. నాంపల్లి మొదటి అదనపు సెషన్స్‌ కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధరించింది. పోలీసులు సరియైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కుంచాల సునీత, నిందితుడు ఎనెగంటి చెన్నయ్యకు 20ఏళ్ల జైలు శిక్షతో పాటు 25వేల రూపాయల జరిమానాను విధించారని పోలీసులు వివరించారు. కేవలం కేసు నమోదు చేసిన నాలుగున్నర నెలల్లోనే దర్యాప్తు విచారణ పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ హఫీజుద్దీన్ తెలిపారు.

ఇవీ చూడండి :

'ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు​ అమలు చేయండి'

'ఏసీబీ అమూల్ కంపెనీ బ్యూరోగా పనిచేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.