- మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు
పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం ఏం సమాధానం చెప్తారు..?
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా(tdp) కార్యకర్తలపై దాడులు పెరిగాయిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(atchannaidu) అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో తెదేపా కార్యకర్తలపై దాడిని అచ్చెన్న ఖండించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాధ్యతల స్వీకరణ
తితిదే(TTD) స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 21న వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని తితిదే పాలకమండలి పదవీకాలం ముగిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5 కిలోల బంగారం పట్టివేత
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులూ లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ పరిశ్రమకు ఊతమివ్వాలి'
ప్రధాని నరేంద్ర మోదీ 'టాయ్‌కాథోన్-2021(Toycathon-2021)' సదస్సులో వర్చువల్‌గా హాజరయ్యారు. బొమ్మల తయారీ పరిశ్రమలో భారత వాటాను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సూరత్ కోర్టుకు రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019 నాటి పరువునష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తుది వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంస్కరణలు అవసరం
ఉపాధ్యాయుల అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈ విధానం సరిగా ఉండటం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. పోస్టుల భర్తీలో టెట్‌కు కొన్ని రాష్ట్రాలు వెయిటేజీ ఇవ్వగా- మరికొన్ని దీన్ని అర్హత పరీక్షగానే పరిగణిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టీకా వేసుకోకపోతే భారత్ వెళ్లిపోండి'
ఫిలిప్పీన్స్ పౌరులంతా కరోనా టీకా వేయించుకొనేందుకు ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని ప్రజలంతా భారత్కో, అమెరికాకో మరో చోటుకో వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా ఫొటోల వల్లే హీరోగా ఛాన్స్'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు(Hrithik Roshan) తొలిసారి సినిమా ఛాన్స్.. తన వల్లే వచ్చిందని అన్నారు ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ. ఈ విషయం హృతిక్యే స్వయంగా తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. త్వరలోనే తన కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రతిసారి కొత్త విజేతనే
డబ్ల్యూటీసీ తొలి ఛాంపియన్‌గా న్యూజిలాండ్ అవతరించింది. అయితే గత ఎనిమిదేళ్లలో జరిగిన ఏడు ఐసీసీ టోర్నీల్లో ఏడు జట్లు విజేతగా నిలవడం విశేషం. ఇంతకీ ఆ టోర్నీలు ఏంటి? అందులో గెలిచింది ఎవరు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">