ఉత్సాహంతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. సమాజంలో తోటివారికి సహాయపడతారు. కీర్తి పెరుగుతుంది. గోవింద నామాలు చదవాలి
మధ్యమ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకం చదవండి.
మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది
అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలుచేస్తాయి.
ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్రనామాలు పారాయణ చేయడం మంచిది.
మీరు పనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీరామ నామాన్ని జపించాలి.
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మి గణపతి ఆరాధన శుభప్రదం.
పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది.
మీమీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.