- 8 ఏళ్ల బాలిక...250 కి.మీ. స్కేటింగ్..
పుత్తూరు పట్టణానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి.. వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యంగా 250 కిలో మీటర్లు ఏకధాటిగా స్కేటింగ్ పూర్తి చేసింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నంగిలిలో ప్రారంభమైన ఈ స్కేటింగ్ నగరి వరకు కొనసాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తూర్పుగోదావరి జిల్లాలో బైక్‌ను ఢీకొన్న వ్యాన్... ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురులంక-యానాం గౌతమి వంతెనపై ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులతో పాటు వారి కుమారుడు మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది'
రాష్ట్రంలో బియ్యం మాఫియాపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అ.ని.శా. అధికారులకు తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. రేషన్ బియ్యం తరలింపుపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పీకేతో నితీశ్ కుమార్ డిన్నర్.. ఆంతర్యమేంటో..?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. రెండేళ్ల క్రితం జనతాదళ్(యునైటెడ్) పార్టీ నుంచి పీకేను తప్పించిన తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కరోనా తగ్గుముఖం.. 20 వేల దిగువకు కొత్త కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 48,847 మంది కోలుకున్నారు. 673 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలే హిజాబ్ వివాదాన్ని రాజేస్తున్నాయని కర్ణాటక మంత్రి అశోక్ ఆరోపించారు. నిరసనలు చేపట్టాలని స్థానిక సంస్థలను ఐసిస్ కోరిందని చెప్పారు. ఈ కుట్ర వెనక ఉన్న ఉగ్రవాదులను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ukraine Crisis: మభ్యపెట్టి దెబ్బతీయడానికి రష్యా సిద్ధం?
'ఫాల్స్ ఫ్లాగ్'.. రష్యా చిరకాల పోరాట వ్యూహం. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ఆ ఎత్తుగడనే అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా, బ్రిటన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IDBI: 'రిటైల్ బ్యాంకింగ్‌తో వృద్ధిబాట'
కొవిడ్ ముందునాటి స్థాయికి తమ కార్యకలాపాలు చేరుకున్నట్లు ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ ఎండీ సురేష్ ఖతాన్హర్ తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తద్వారా వినియోగదార్లకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కష్టాలను ఎదురీది.. అండర్-19 ప్రపంచకప్ హీరోగా తెలుగు తేజం
ఇదో తండ్రీకొడుకుల కథ. ఆ కొడుకుని సరదాకే క్రికెట్ నిచ్చెన ఎక్కించాడు ఆ తండ్రి. అతను చకచకా ఎక్కడం చూసి తన చేతుల్ని నిచ్చెన మెట్లుగా మలిచాడు. కొడుకు మరింత పైకి వెళ్లాలని ఉద్యోగాన్నీ వదులుకుని రోజుకూలీగా మారాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఫొటోలు చూసి షాకయ్యా: అనుపమ
'ప్రేమమ్' సినిమాతో కుర్రకారు మనసులు దోచుకుంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అఆ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపించి ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.