- Live Updates : కలెక్టరేట్ల ముట్టడి అడ్డంగిత... ఉపాధ్యాయులను ఠాణాలకు తరలిస్తున్న పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరెట్ల ముట్టడికి ఉద్యోగా సంఘాలు యత్నిస్తుండగా .. వారిని అడ్డుకునేందుకు కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలో విశాఖ కలెక్టరేట్‌కు తరలివచ్చిన ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యల నగరంలో మరో సరస్వతీ నిలయం
విద్యల నగరం విజయనగరంజిల్లా సిగలో మరో సరస్వతి నిలయం కొలువుదీరింది. జేఎన్టీయూ విజయనగరం కళాశాల పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మారింది. ఈ మేరకు.. జేఎన్టీయూ గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ts cm kcr on employees: పరస్పర బదిలీలకు సీఎం కేసీఆర్ అంగీకారం.. నేడు ఉత్తర్వుల జారీ
ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరస్పర బదిలీలపై ఇవాళ ఉత్తర్వులు వెలువరించనున్నట్లు తెలిపింది. భార్యాభర్తల బదిలీ వినతులూ పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో కరోనా కల్లోలం- ఒక్కరోజే 3 లక్షలకుపైగా కేసులు
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 3,17,523 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 491 మంది మరణించారు. 2,23,990 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'తగ్గేదేలే'.. పుష్ప డైలాగ్‌తో కొవిడ్‌పై కేంద్రం అవగాహన
కరోనాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్‌ను ఉపయోగించింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. 'డెల్టా అయినా, ఒమిక్రాన్ అయినా నేను మాస్కు తీసేదే లే' అని పేర్కొంటూ మీమ్‌ను రూపొందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కనకపు విలాసాలకు వధువు నో.. ఏడు పేద కుటుంబాల్లో జీవితకాలపు వెలుగులు
పెళ్లిని ఏ వధువైనా.. ఖరీదైన ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించి జరుపుకుంటుంది. కానీ కేరళ కోజికోడ్‌కు చెందిన పెళ్లికూతురు మాత్రం చాలా సాధారణంగా వివాహం చేసుకుని, మిగిలిన డబ్బులతో పేదలకు సహాయం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాకు 'కిమ్' షాక్.. అణు పరీక్షలపై ఇక 'తగ్గేదే లే'!
ట్రంప్ హయాంలో నిలిపివేసిన అణు కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. అగ్రరాజ్యంపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యోగం మారేందుకే 82 శాతం మొగ్గు.. అదే కారణం!
భారత్‌లో చాలా మంది ఉద్యోగులు ఈ సంవత్సరం ఉద్యోగం మారాలని భావిస్తున్నారట. లింక్ట్‌ఇన్ చేసిన ఓ సర్వేలో 82 శాతం మంది ఉద్యోగులు ఇదే చెప్పారట. కొత్త ఉద్యోగాల అన్వేషణలో అనుకూల పనివేళలకే మొదటి ప్రాధాన్యమిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా-వెస్టిండీస్ సిరీస్.. రెండు వేదికల్లోనే 6 మ్యాచ్‌లు!
టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య సిరీస్ రెండు వేదికల్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్, కోల్‌కతాలో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 50 రోజుల 'అఖండ'.. రూ.200 కోట్ల వసూళ్లు
అత్యంత విజయవంతంగా థియేటర్లలో 50వ రోజులోకి అడుగుపెట్టిన 'అఖండ'.. సరిగ్గా ఇదే రోజు రూ.200 కోట్ల కలెక్షన్ మార్క్‌ను అందుకుంది. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.