ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 11 AM - ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు

Top News: ప్రధాన వార్తలు @ 11 AM

11am top news
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 27, 2021, 11:00 AM IST

  • జలాశయానికి భారీ వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.40 అడుగులకు నీరు చేరింది. మరో 55 టీఎంసీల నీరు వస్తే... శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వర్షాలు తగ్గాక పనులు చేస్తాం..!

రహదారుల మరమ్మతులకు.. రవాణా, ఆర్‌అండ్‌బీ చర్యలు తీసుకుంటోంది. వర్షాలు తగ్గాక పునరుద్ధరణ పనులు చేసేందుకు.. టెండర్లను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,140 పనులుండగా.. ఇప్పటికే 403 పనులను గుత్తేదారులకు అప్పగించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం అవుతుందనే భావనలో గుత్తేదారులు ఉన్నారని.. వాటిని దూరం చేస్తామని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆసుపత్రిలో భూత వైద్యం

ఆమెకు జ్వరం వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజులైంది. అయినా మార్పు రాలేదు. రోజురోజుకూ నీరసించిపోతోంది. చివరికి అందుబాటులో ఉన్న మహిళా భూత వైద్యురాలిని ఆసుపత్రి వార్డుకు తీసుకువచ్చారు. ఆమె వార్డులోనే రోగి నాడి పట్టుకుని మంత్రాలు జపించింది. ఈ దృశ్యం విశాఖ ఏజెన్సీ పాడేరు ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యునెస్కోకు పుస్తకం రాశా!

ప్రఖ్యాత కాకతీయ కట్టడమైన రామప్ప... యునెస్కో వారసత్వ గుర్తింపు పొందేందుకు...ఎంతోమంది ఎన్నో విధాల కృషి చేశారు. కొందరు ఏళ్లకేళ్లు పరిశోధన సాగిస్తే... మరికొందరు మహోతృష్ణమైన శిల్ప సంపదతో అలరారే కట్టడం గురించి... రచనలు చేశారు. రామప్ప శిల్ప వైభవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటివారిలో ప్రముఖ నృత్యకారిణి, చరిత్ర పరిశోధకురాలు చూడామణి నందగోపాల్ ఒకరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు(Covid 19 India) భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్​ కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 21 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమం'

సందేహించదగ్గ కారణాల్లేకపోతే.. ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది. గుజరాత్​కు చెందిన ఓ హత్యకేసు విచారణలో జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వైద్య పరమైన ఆధారాలకు, మౌఖిక సాక్ష్యాలకు మధ్య వైరుద్ధ్యం ఉన్నప్పుడే ప్రత్యక్ష సాక్ష్యాన్ని అనుమానించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాస్ లీడర్ల కొరత

భాజపాను మొదటి నుంచీ.. ప్రాంతీయ నాయకుల కొరత వేదిస్తోంది. తాజాగా కర్ణాటకలో భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప నిష్క్రమణతో.. లోటు మరింత పెరిగింది. ఒక్క కర్ణాటకలోనే కాదు మిగతా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ నేతలు లేక కమలదళం ఇబ్బంది పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎన్ని కరోనాలున్నా.. ఒకటే మందు

కరోనా వైరస్​లన్నింటికీ ఒకే ఔషధం తయారు చేసే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. 27 కరోనా వైరస్‌ జాతులు, కొవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన వేల నమూనాల్లోని వైరల్‌ ప్రొటీన్లను విశ్లేషించి.. 'డ్రగ్ బైండింగ్ పాకెట్ల'ను గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమ్మ నగలమ్మి..

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​ తరఫున కత్తిసాములో (ఫెన్సింగ్​) బరిలోకి దిగింది తమిళనాడుకు చెందిన భవానీ దేవి. ఈమె ఆడేవరకు కూడా ఇదొక ఆట ఉందని చాలా మందికి తెలియదు. అయితే తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపింది భవానీ. తాను పడ్డ కష్టాలకు ప్రస్తుతం గుర్తింపు లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అగ్ర తారల వెబ్‌ సిరీస్‌

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ 'నవరస' ట్రైలర్​(Navarasa Trailer) విడుదలై ఆకట్టుకుంటోంది. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్‌' వేదికగా స్ట్రీమింగ్‌ కానుందీ సిరీస్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.