- భారీగా నిలిచిన వాహనాలు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణకు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ పాస్ నిబంధన తప్పనిసరి అన్న నిబంధన తెలియక వచ్చినవారిని.. రామాపురం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జర్మన్ టెక్నాలజీతో 2 ఆసుపత్రుల నిర్మాణం
కరోనా రోగుల చికిత్స కోసం అనంతపురం జిల్లాలో జర్మన్ టెక్నాలజీతో మరో రెండు తాత్కాలిక ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రిని ఆర్జా ఉక్కు కర్మాగారం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఆక్సీజన్ సౌకర్యం ఉన్న 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్‌తో వృద్ధుడు మృతి
కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వృద్ధుడు.. బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలోని నున్నలో జరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడిన వృద్ధుడిని ప్రవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దీక్ష శిబిరంలో మంటలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ..కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో మంటలు చేలరేగాయి. ఉదయం 5 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష శిబిరంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఓకే రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్‌లు
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఓ రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్‌లను వైద్యులు గుర్తించారు. దేశంలో ఇలాంటి కేసు నమోదవటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగా 2.40 లక్షల కేసులు
దేశంలో కరోనా మరణాలు నాలుగు వేల లోపునకు పడిపోయాయి. శనివారం మరో 3,741 మంది మరణించారు. కొత్తగా 2.40 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పగించిన బీఎస్ఎఫ్
సరిహద్దులో మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాయి భారత సైనిక బలగాలు. పాక్‌కు చెందిన ఇద్దరు పౌరులు పొరపాటున దేశంలోకి ప్రవేశించగా.. వారిని ఆ దేశ రేంజర్లకు అప్పగించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ నెలలో పన్నెండోసారి
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.93.21కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు
కరోనా వల్ల ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లోని మ్యాచ్‌ల్ని సెప్టెంబరు-అక్టోబరులో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. త్వరలో ఈ విషయంతో పాటు వేదిక గురించి స్పష్టత వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూట్యూబ్‌లో మరో రికార్డు
'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ ప్లాట్ఫామ్లో నాలుగు మిలియన్ల(40 లక్షలు) పైగా లైక్స్ సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.