ETV Bharat / business

'సంపద సృష్టికి తుక్కు పాలసీ దోహదం'

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్​లో వర్చువల్​గా నేషనల్​ ఆటోమొబైల్​ స్క్రాపేజ్​ పాలసీని ఆవిష్కరించారు. ఈ విభాగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్​మెంట్​ సమిట్​లో ఆయన మాట్లాడారు. అంకుర సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

author img

By

Published : Aug 13, 2021, 12:20 PM IST

Updated : Aug 13, 2021, 2:17 PM IST

PM Modi
ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వెహికిల్ స్క్రాపేజ్ (వాహనాల తుక్కు) పాలసీని ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా గుజరాత్​లో ఈ పాలసీని ప్రారంభిచారు. దీనితో అభివృద్ధి పరంగా భారత్​ మరో కీలక మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు. కాలుష్య భరిత, కాలం చెల్లిన వాహనాలను తగ్గించుకునేందుకు ఈ పాలసీ ఎంతో కీలకం కానుందని వివరించారు.

వాహనాల తుక్కు కోసం మౌలిక వసతుల ఏర్పాటు విభాగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ కీలక విషయాలను వెల్లడించారు. ఈ పాలసీ భారత్ ఆటోమొబిలిటీ, వాహన రంగానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సుస్థిర, పర్యావరణహితమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వివరించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు కూడా ఈ పాలసీ ఉపయోగపడనున్నట్లు తెలిపారు. యువత, అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని మోదీ పిలుపునిచ్చారు.

ఏమిటి ఈ తుక్కు పాలసీ?

దేశంలో ప్రస్తుతం 20 ఏళ్లపైబడిన తేలికపాటి వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లకుమించినవి 34 లక్షలు ఉన్నాయి. ఎలాంటి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేని 15 ఏళ్లకుమించిన భారీ వాణిజ్యవాహనాలు 17 లక్షలు ఉన్నాయి. కొత్తవాహనాలతో పోలిస్తే పాతవాహనాలు 10-12 రెట్లు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించడం.. కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం సహా బహుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పాలసీని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. కొత్త వాహనాల కొనుగోళ్లు పెరగడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30-40వేల కోట్ల జీఎస్‌టీ ఆదాయం పెరుగుతుందని కూడా భావిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 13, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.