ETV Bharat / business

కరోనా ప్రభావంతో జీవనకాల కనిష్ఠానికి రూపాయి

కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావంతో కరెన్సీ మార్కెట్లో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠంతో రూ.76.44కు దిగజారింది.

Rupee slides to all-time low
జీవనకాల కనిష్ఠానికి రూపాయి
author img

By

Published : Apr 15, 2020, 8:25 PM IST

కరెన్సీ మార్కెట్​లో రూపాయి నేడు భారీగా క్షిణించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇవాళ నష్టాలు నమోదు చేసిన నేపథ్యంలో ఆ ప్రభావం రూపాయిపై పడిందని విశ్లేషకులు అంటున్నారు.

నేటి ట్రేడింగ్...

ఫారెక్స్ మార్కెట్​లో రూ.76.07 వద్ద సానకూలంగా ట్రేడింగ్​ ప్రారంభించింది రూపాయి. డాలర్​తో పోలిస్తే మారకం విలువ నేడు ఒక దశలో రూ.75.99 గరిష్ఠాన్ని.. రూ.76.48 కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు రూ.76.44 దగ్గర జీవనకాల కనిష్ఠం వద్ద స్థిరపడింది.

కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్​డౌన్​ను మే 3 వరకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా రూపాయిపై ప్రభావం చూపినట్లు ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:10.2 లక్షల మందికి ఐటీ రిఫండ్​ బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.