ETV Bharat / business

Mahindra K2 Project: 'కేటీఆర్‌ (KTR) ఇలాకాలో కే2 ప్రాజెక్టు' విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? - ktr speech

తెలంగాణ జహీరాబాద్‌ మహీంద్రా ప్లాంట్‌ (Zaheerabad Mahindra Plant) మరో ఘనత సాధించింది. కే2 సిరీస్‌ ట్రాక్టర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ట్రాక్టర్లను త్వరలో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ వివరాలతో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ''కేటీఆర్‌ (KTR) ఇలాకాలో కే2 ప్రాజెక్టు' విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? అని ట్విటర్‌లో ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

Mahindra K2 Project
Mahindra K2 Project
author img

By

Published : Sep 30, 2021, 11:04 AM IST

తెలంగాణ జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల(Mahindra tractors) కర్మాగారం మరో ఘనత సాధించింది. 20 అశ్వికశక్తి(హెచ్‌పీ) సామర్థ్యంతో పనిచేసే తేలికపాటి కే2 సిరీస్‌ ట్రాక్టర్ల (Mahindra K2 Project) ఉత్పత్తిని ప్రారంభించింది. సంస్థ వ్యవసాయ యంత్ర విభాగం ఛైర్మన్‌ హేమంత్‌ సిక్కా బుధవారం ప్లాంట్‌ని సందర్శించారు. ఆ వివరాలతో మంత్రి కేటీఆర్‌కు (MINISTER KTR) ట్వీట్‌ చేశారు. ఈ ట్రాక్టర్లను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ (KTR) హర్షం వ్యక్తం చేశారు.

రూ.100 కోట్ల పెట్టుబడితో విస్తరణ

మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ (Mahindra & Mahindra Company) జహీరాబాద్‌లో 2012లో దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా లక్ష ట్రాక్టర్లు తయారవుతున్నాయి. తద్వారా ప్రపంచంలో అత్యధిక ట్రాక్టర్ల తయారీ సంస్థగా మహీంద్రా గుర్తింపు పొందింది. సంస్థ విస్తరణలో భాగంగా గత ఏడాది నవంబరులో జపాన్‌కు చెందిన మిత్సుబిషితో కలిసి కే2 సిరీస్‌ ట్రాక్టర్ల (Mahindra K2 Project) తయారీ ప్లాంట్‌ని చేపట్టింది. ఇందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టింది. మరో 1500 మందికి ఉపాధి కల్పించింది. పది నెలల వ్యవధిలోనే ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసి.. 37 రకాల ట్రాక్టర్ల తయారీని ప్రారంభించింది. వీటిని ప్రధానంగా అమెరికా, జపాన్‌, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు ఆ సంస్థ సన్నద్ధమవుతోంది.

...

తెలంగాణకు ఎంతో ప్రతిష్ఠాత్మకం: కేటీఆర్‌

హేమంత్‌ సిక్కా ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ (MINISTER KTR) స్పందిస్తూ.. తెలంగాణకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్ఠాత్మకమని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన కే2 ట్రాక్టర్ల తయారీ హబ్‌గా తెలంగాణ మారడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు నిరంతర మద్దతు ఇవ్వడం, పరిశ్రమలను విస్తరించడంపై ఆ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. కేటీఆర్‌ ఇలాకాలో కే2 పేరు గల ప్రాజెక్టు విజయవంతం కాకుండా ఎలా ఉంటుందని ట్వీట్‌ చేశారు.

  • కే2 సిరీస్‌ తొలి ట్రాక్టర్‌ను అక్టోబరులో ఆవిష్కరించేందుకు సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తోంది.

ఇదీచూడండి:

LETTER TO GRMB: తెలంగాణ డీపీఆర్​లను ఆమోదించొద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.