ETV Bharat / business

చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధుల నిర్మూలనకు కృషి చేసే కొయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్​నెస్ ఇన్నోవేషన్స్ సంస్థ భారత్​ బయోటెక్​లతో ఒప్పందం కుదుర్చుకుంది. చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ ఒప్పందం కృషి చేస్తుంది.

author img

By

Published : Jun 3, 2020, 5:03 PM IST

bharat biotech dealing with cipi
చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం... ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల నిర్మూలనకు కృషి చేసే కొయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్​నెస్ ఇన్నోవేషన్స్ సంస్థ... ఇంటర్నేషనల్ వాక్సిన్ ఇనిస్టిట్యూట్, భారత్​కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్​లతో కూడిన ఓ క‌న్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నూతన ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్ తయారీ, క్లినికల్ ట్రయల్ కోసం సీఈపీఐ రూ.106 కోట్లను భాగస్వామ్య కంపెనీలకు ఇవ్వనుంది. ఈ క‌న్సార్షియంలో భాగంగా సీఈపీఐ- ఇండియా కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం 16 కోట్ల 59 లక్షల రూపాయలను వ్యాక్సిన్ తయారీ, క్లినికల్ ట్రయల్స్​కు వినియోగించనున్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్​ల తయారీ, అఫర్డబుల్ వ్యాక్సిన్​ల అభివృద్ధి కోసం భారత్ బయోటెక్​కు దోహదపడుతుందని... పలు దేశాల్లో ప్రమాదఘంటికలు మోగిస్తోన్న చికన్ గున్యా నుంచి ప్రపంచదేశాలను కాపాడేందుకు ఈ భాగస్వామ్యం పనిచేస్తుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. చికన్ గున్యా నివారణలో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఈ ఒప్పందంలో భాగం కావడం తమ కంపెనీకి గర్వకారణమని భారత బయెటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.

ఇవీ చూడండి: మీ ఒంట్లో అది ఉంటేనే... మీరు ఓకేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.