జగన్ నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారని మాజీ మంత్రి లోకేశ్.. ట్విటర్లో ఎద్దేవా చేశారు. రైతుల వడ్డీలేని రుణాలకు రూ.3, 500 కోట్లు కేటాయిస్తామని రైతు దినోత్సవం నాడు హామీ ఇచ్చిన జగన్ బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఇదేనా జగన్ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అసలేమీ ఇవ్వలేదని అసెంబ్లీలో చెప్పిన జగన్ మరుసటి రోజు ఇంతే ఇచ్చిందని మాట మార్చారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో నామమాత్రంగా 100 కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు.
పథకాలకు వైఎస్, జగన్‌ల పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు కానీ, అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా అని ప్రశ్నించారు. ఈ పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేదని సూచించారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని జగన్ ఊదరకొట్టారని...., చివరికి ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు విదిల్చారని ధ్వజమెత్తారు.
కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.... పైగా గృహరుణాలన్నీ రద్దు చేస్తామని కూడా చెప్పారని... తీరా బడ్జెట్ చూస్తే గృహ నిర్మాణానికి కేవలం 8 వేల 615 కోట్లు ఇచ్చారన్నారు. జగన్ నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదుకదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఇదీ చదవండి :