జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ గాజువాకలో గురువారం నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ దాఖలు సమయంలో అందజేసిన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. వీటిలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో కేవలం రూ.4,76,436 రూపాయలు, వారి సతీమణి వద్ద రూ.1,53,500 రూపాయలు ఉన్నాయని వెల్లడించారు. బంజారా హిల్స్ ఎమ్మెల్యే నివాసగృహ సముదాయ ప్రాంతాల్లో ఒక ప్లాట్ ఉందని పేర్కొన్నారు.
సుమారు రూ.33 కోట్ల 72 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరమైన బకాయిలు 56 లక్షలు ఉన్నట్లు ఎన్నికల అధికారికి అందించిన పత్రాల్లో పొందుపరిచారు.
పవన్ ఆస్తుల వివరాలు
పవన్ స్థిరాస్తులు...రూ. 40.81 కోట్లు
చరాస్తులు...రూ.12కోట్లు
అప్పులు.....రూ.33.72 కోట్లు
కుటుంబ సభ్యుల ఆస్తులు
భార్య, పిల్లల పేర్లపై ఉన్న స్థిరాఆస్తులు...రూ.3.2కోట్లు
చరాస్తులు.....రూ.40 లక్షలు
ప్రభుత్వ బకాయిలు ...........రూ.56 లక్షలు
పవన్ వార్షికాదాయం
2013-2014.....రూ.7.32 కోట్లు
2014-2015.....రూ.5.37 కోట్లు
2015-2016......రూ.4.35 కోట్లు
2016-2017......రూ.15.28 కోట్లు
2017-2018.......రూ.9.68 కోట్లు