సీఎం కోసం శ్రీయాగం.. సతీమణి గో పూజ - నారా భువనేశ్వరి
నవ్యాంధ్ర అభివృద్ధి కాంక్షించే చంద్రబాబే మళ్లీ అధికారం చేపట్టాలని కాంక్షిస్తూ తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ శ్రీయాగం చేపట్టారు. చివరి రోజు పూజా కార్యక్రమానికి.. సీఎం సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. గోపూజ చేశారు. రుత్వికుల నుంచి ఆశీర్వచనాలు పొందారు.
శ్రీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూతెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడలో శ్రీయాగం నిర్వహించారు.ఆయన సోదరి దంపతులు పీటలపై కూర్చుని యాగ క్రతువు నిర్వహించారు. మూడు రోజులు పాటు చేసిన శ్రీయాగం పూర్ణాహుతితో ముగిసింది. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.గోపూజ చేశారు. రుత్వికుల ఆశీర్వచనాలు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.నవ్యాంధ్ర అభివృద్ధి కొనసాగేందుకు మరోసారిచంద్రబాబు అధికారం చేపట్టాలని రాధాకృష్ణ అన్నారు.
sample description