రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలోని 5 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు. ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచార గడువు ముగిసిందన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా రీపోలింగ్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేసినట్లు చెప్పారు. రిటర్నింగ్ అధికారి, కేంద్ర పరిశీలకుడు, డీఎస్‌పీల పర్యవేక్షణలలో రీపోలింగ్ జరుగుతుందని ద్వివేది వివరించారు.
రీపోలింగ్ జరిగే ప్రతీ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు ద్వివేది స్పష్టత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట రెండు చోట్లా వీడియో కవరేజ్ ఉంటుందన్నారు.
ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకోవచ్చని ఈసీ అన్నారు. రీపోలింగ్ ఓట్ల లెక్కింపు సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23నే ఉంటుందన్నారు.
23న తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు
మే 23న జరిగే ఓట్ల లెక్కింపుపై ఈసీ ద్వివేది స్పష్టత నిచ్చారు. కౌటింగ్ రోజున తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్లు లెక్కిస్తామన్నారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.