అలనాటి బాలీవుడ్ తార మధుబాల 86వ పుట్టినరోజును పురస్కరించుకుని గూగుల్ డూడుల్‌గా గౌరవించింది గూగుల్ సంస్థ. బెంగళూరు చిత్రకారుడు మహ్మమద్ సాజిద్ దీన్ని చిత్రీకరించాడు.
మధుబాల అసలు పేరు ముంతాజ్ జెహన్ బేగం దేహ్లవి,1933లో దిల్లీలో జన్మించింది. తొమ్మిది సంవత్సరాల వయుసులోనే వెండితెరపై ఆరంగ్రేట్రం చేసింది.
1947లో 14 ఏళ్ల వయసులో నీల్ కమల్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మధుబాల, అందరితో శెభాష్ అనిపించుకుంది.
1949లో తొమ్మిది సినిమాల్లో నటించింది. మహల్ చిత్రంలో నటనకు గాను ప్రశంసలు అందుకుంది.
కామెడీ, డ్రామా, రొమాంటిక్ చిత్రాలతో "మార్లిన్ మన్రో ఆఫ్ బాలీవుడ్"గా పేరు సంపాదించింది.
కెరీర్ మొత్తంలో 70 చిత్రాల్లో కనిపించింది. హిట్ సినిమాలైన హాఫ్ టికెట్, మొఘల్-ఈ-ఆజామ్, చల్తీ కా నామ్ ఘాడీ, హౌరా బ్రిడ్జ్‌లలో ఆమె నటించింది. ప్రఖ్యాత థియేటర్ ఆర్ట్స్ మేగజైన్ "ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ది వరల్డ్" గా ఆమెకు నామకరణం చేసింది.