ఆముదాలవలసలో కూన రవికుమార్ ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణంలో పూజారిపేట, కొత్తకోటవారి వీధి, కృష్ణాపురం కాలేజీ వీధి, సాయినగర్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చైతన్య రథంపై తిరుగుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపాను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గీత, వైస్ ఛైర్‌పర్సన్ కోన వెంకట లక్ష్మి, తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి :భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యం: దేవినేని హంస