ఇదీ చదవండి : 'ఇళ్లు లేని గిరిజనుడు ఉండకూడదు'
గుంతకల్లులో ఆలస్యంగా ప్రారంభమైన విత్తన పంపిణీ - విత్తనాల పంపిణీ
అనంతపురం జిల్లా గుంతకల్లు శాసనసభ పరిధిలో విత్తనాల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లాలో ఈ నెల 15 నుంచే విత్తన సరఫరా జరుగుతుండగా..గుంతకల్లులో ఇవాళ్టి నుంచే విత్తనాలు అందిస్తున్నారు. విత్తన కొరతే ఆలస్యానికి కారణమని అధికారులు తెలిపారు.
విత్తనాలు పంపిణీ చేస్తోన్న ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి
అనంతపురం జిల్లా గుంతకల్లులో వేరుశెనగ విత్తనాలు పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. జిల్లాలో ఈనెల 15నుంచే విత్తన పంపిణీ ప్రారంభమైనా...గుంతకల్లుకు విత్తనాలు రావడం కొంత ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు. విత్తన నిల్వల కొరత వలనే ఆలస్యానికి కారణమని వ్యవసాయశాఖ తెలిపింది. పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రైతులందరికీ రాయితీ విత్తనాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. విత్తనాల కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నందున రైతులు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. వజ్రకరూరులో విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి : 'ఇళ్లు లేని గిరిజనుడు ఉండకూడదు'