చంద్రబాబుతో కేశినేని భేటీ. లోక్సభ పక్షఉపనేత, విప్ పదవులు తిరస్కరిస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తెదేపా అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఆయనతో భేటీ అయిన నాని.. పలు విషయాలపై చర్చించారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు..అసంతృప్తికి గల కారణాలు వివరించారు. విజయవాడం ఎంపీగా మాత్రమే కొనసాగుతానని అధినేతకు తేల్చిచెప్పిన నాని..తెదేపాను వీడేది లేదని స్పష్టం చేశారు. బుధవారం లోక్సభ పక్ష ఉపనేత, విప్ పదవులకు సమర్థులను ఎన్నుకోండని ఫేసుబుక్లో కేశినాని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కేశినేని నాని ఫేసుబుక్లో ఏమన్నారు..ఇక్కడ చదవండి..!