"బరేలీ లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వారి సభ్యులు పార్లమెంటులో 'ముమ్మారు తలాక్' బిల్లు ఉపసంహరణకు హామీ ఇచ్చారు. వారు (కాంగ్రెస్) కేవలం రాజకీయ లబ్ధికోసం ముస్లిం మైనారిటీలను ఆకట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. వారి మనస్సాక్షి వారిని ప్రశ్నించడంలేదా?" అని అరుణ్‌జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు.
అవకాశవాద రాజకీయ నాయకులు పత్రికల్లో పతాక శీర్షికల్లో కనబడాలని చూస్తారు. కానీ జాతి నిర్మాతలు భవిష్యత్ గురించి ఆలోచిస్తారని జైట్లీ వ్యాఖ్యానించారు.
అప్పుడు...
గతంలో దివంగత రాజీవ్‌గాంధీ కూడా 'షా బానూ' కేసులో ఇలాంటి తప్పే చేశారని అరుణ్‌జైట్లీ విమర్శించారు. విడాకులు పొందిన మహిళలకు భృతి కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాదని రాజీవ్ అన్యాయం చేశారని, ఫలితంగా మహిళలు పేదరికంలో మగ్గిపోయారని అరుణ్‌జైట్లీ అన్నారు.
ఇప్పుడు...
32 సంవత్సరాల తరువాత అతని కుమారుడు రాహుల్ సైతం ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నారని జైట్లీ విమర్శించారు.
నిఖా-హలాలా అంటే?
ఇటీవల బరేలీలో ఓ 'నిఖా-హలాలా' ఘటన వెలుగుచూసింది. భర్త నుంచి రెండు సార్లు తలాక్చెప్పబడిన ఓ మహిళను ఇస్లామిక్ చట్టం అనుసరించి బలవంతంగా నిఖా-హలాలా చేయమని ఒత్తిడి తెచ్చారు. మొదటిసారి మామతో, రెండోసారి తన భర్త సోదరుడితో నిఖా-హలాలా కార్యక్రమం నిర్వహించారు.
'నిఖా-హలాలా' ఆచారం ప్రకారం ఓ భర్త తను విడాకులు ఇచ్చిన భార్యను మరలా పెళ్లి చేసుకోలేడు. ఒక వేళ మళ్లీ ఆమెను పెళ్లి చేసుకోదలిస్తే ఆమెకు మరొకరితో వివాహం జరిగి విడాకులు తీసుకుని ఉండాలి. ఆ తరువాత ఆమె కొన్నాళ్లు ఏకాంతంగా ఉంటుంది. ఈ కాలాన్ని ఇద్దత్ అంటారు. ఆ తరువాత ఆమెను మొదటి భర్త వివాహం చేసుకోవచ్చు.