అనంతపురం జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కదిరిలోని హన్మాన్ ఉప సమితి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. అనంతపురంలోని పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. పంచామృతాభిషేకం, యాగాలు, మహా మంగళ హారతి కార్యక్రమాలకు విశేష జనవాహిని హాజరైంది. పెనుకొండలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభించారు. వడమాలలతో హనుమ విగ్రహాలను అలంకరించి పూజించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
ఇవీ చదవండి...పంచముఖ ఆంజనేయునికి పాలాభిషేకం