చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణలో ఈవీఎంలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకులను తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన రిటర్నింగ్ అధికారి వాహనంపై రాళ్లు రువ్వారు. ఈవీఎం ధ్వంసం అవ్వడం వలన కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దెబ్బతిన్న ఈవీఎం బదులు మరొకటి ఉపయోగించాలని సిబ్బందిని కోరారు. వీవీ ప్యాట్ యంత్రం సురక్షితంగానే ఉందని ఎస్పీ తెలిపారు. ఈ ఘర్షణలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గాయపడ్డారని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి : సార్వత్రిక సమరంలో 'వైకాపా ధ్వంసరచన'!