ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న సందర్భంలో కౌంటింగ్ రోజున పాటించాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. కౌంటింగ్ రోజు ఈవీఎంలు తరలింపు, ఓట్లు, వీవీప్యాట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనుంది.
విజయవాడ గురునానక్ కాలనీ ఎన్ఏసీ కల్యాణమండపంలో శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది, ఈసీ డైరెక్టర్, అండర్ సెక్రటరీ హాజరుకానున్నారు.