ఈవీఎం బ్యాలెట్లలో చిన్న పొరపాటు కూడా లేకుండా పరీక్షిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రారంభించామని తెలియజేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 7 వేల వరకూ ఈవీఎం బ్యాలెట్ పేపర్లుఅవసరమవుతాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 30 వేల చొప్పున ముద్రించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 30 మందికి పైగా అభ్యర్థులు ఉన్న కారణంగా 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని తెలిపారు. అభ్యర్థుల ఫోటోలను కూడా బ్యాలెట్ పేపర్లపై ప్రింట్ చేస్తున్నందున.. కొంత జాప్యం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.
ఇవీ చదవండి...ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు ముగ్గురి పేర్లతో ప్రతిపాదన