ETV Bharat / briefs

కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే... వంద గిఫ్ట్‌లు ఇస్తా: బాబు

author img

By

Published : Apr 6, 2019, 6:33 PM IST

కేసీఆర్​తో కలిసి వైకాపా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎన్నికల సభలో మాట్లాడిన సీఎం.. కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే నేను వంద గిఫ్ట్‌లు ఇస్తానని బదులిచ్చారు.

చీమకుర్తి ఎన్నికల సభలో సీఎం చంద్రబాబు
చీమకుర్తి ఎన్నికల సభలో సీఎం చంద్రబాబు

ఉగాది.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం...తెదేపా పోరాడేది న్యాయం కోసం.. ధర్మం కోసమని స్పష్టం చేశారు. తెదేపా నేతల్ని ఐటీ దాడులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. ఒక్కమాట చెప్పకుండా సీఎస్‌ను బదిలీ చేశారన్న సీఎం... నరేంద్రమోదీ నియంతలా తయారయ్యారన్నారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ, అన్ని వ్యవస్థల్ని మోదీ ధ్వంసం చేశారని ఆరోపించిన బాబు..అడ్వాణీ ఎన్ని చెప్పినా మోదీ మారరన్నారు. కోడికత్తి పార్టీని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరని తెలిపిన సీఎం... యువత, రైతులు, మహిళలు, ఉద్యోగుల భవిష్యత్తు నా బాధ్యత అన్నారు. ఐదేళ్లలో చెప్పిన పనుల కంటే ఎక్కువ పనులు చేశానన్న చంద్రబాబు...కేసులున్న వైకాపా అభ్యర్థులు అవసరమా అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్లు కొట్టేసిన వ్యక్తి కేసీఆర్‌ అని ధ్వజమెత్తిన చంద్రబాబు..కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే.. తెదేపా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు సొంతం చేసుకుంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. చీమకుర్తికి రూ.62 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించామన్న సీఎం..చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి : 'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'

Intro:AP_TPG_07_06_UGADI_VEDUKALU_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో వికారం నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఇ ఇ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Body:ఈ కార్యక్రమంలో పండితులు కాశీభట్ల నాగ వెంకట పార్వతీశ్వర శర్మ, తాడికొండ నరసింహరావులు పంచాంగ శ్రవణం చేశారు. వికార నామ ఉగాది నూతన సంవత్సరంలో అధికారులకు ఉద్యోగులకు ప్రజలకు రైతులకు ఈ సంవత్సరం లో కలిగే లాభనష్టాల గురించి వివరించారు. ఈ నూతన సంవత్సరంలో వివిధ రాశి ఫలాల చెందిన వారికి సంబంధించి వ్యయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానాలు అంశాలను వివరించారు. ద్వారకతిరుమల దేవస్థానానికి చెందిన యనమండ్ర రవి ప్రకాష్ శర్మ, , ఎస్ శర్మ అ, కూచిబొట్ల సచ్చితానంద ప్రసాద్ పండితులు వేద పఠనం చేశారు. అనంతరం కలెక్టర్ వీరిని ఘనంగా సత్కరించారు.

Conclusion:ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నూతన ఉగాది సంవత్సరం సందర్భంగా అధికార అందరి సహకారంతో జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయాలని కోరారు.
బైట్ ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.