ETV Bharat / briefs

'మమతా బెనర్జీ భారత బెబ్బులి...భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటులో ఆమెది కీలకపాత్ర' - mamatha benarji

పశ్చిమ బంగాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగనుంది. తృణముల్ కాంగ్రెస్​కు మద్దతుగా చంద్రబాబు ఖరగ్​పూర్, కోల్​కతాలలో గురువారం ప్రచారం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు(బుధవారం) సీఎం చంద్రబాబు జార్ గ్రామ్, హాల్దియా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు
author img

By

Published : May 9, 2019, 6:16 AM IST

పశ్చిమ బంగాలో తృణముల్ కాంగ్రెస్​కు మద్దతుగా ప్రచారం చేస్తోన్న చంద్రబాబు...ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ భారత్ బెబ్బులిగా మారే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సభల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు మే 23 తర్వాత దేశానికి కొత్త ప్రధాని వస్తారని, కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాడుతుందని ధీమావ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దీదీ కీలకపాత్ర వహిస్తారని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రచారంలో చంద్రబాబు మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం చంద్రబాబు

మోదీపై విమర్శలు

మతాన్ని అడ్డుపెట్టుకొని మోదీ- అమిత్ షా పశ్చిమ బంగాలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. భాజపాకు స్థానమిస్తే మతవిద్వేషాలకు ఆజ్యం పోసినట్టేనని సీఎం అన్నారు. పౌరపట్టిక, పౌరసత్వ సవరణ బిల్లులతో దేశంలో సంక్షోభం సృష్టించడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. భాజపాయేతర రాష్ట్రలపై కక్షసాధింపు చర్యలు చేస్తోన్న మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించారు. ఏపీలో ఆర్థిక నేరగానికి మోదీ-అమిత్ షా అండగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.

'ఎన్నికల సంఘం తీరు మారాలి'

మోదీ చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ క్లీన్ చిట్​లు ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. బంగాలో 40 మంది తృణముల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. మోదీ మాటే ఈసీకి పరమవాక్కులా మారిందన్న చంద్రబాబు...ప్రధాని చెప్పిందల్లా ఎన్నికల సంఘం తూ.చా.తప్పకుండా పాటిస్తుందని ఎద్దేవా చేశారు. 50 శాతం వీవీప్యాట్​ల లెక్కింపు చేయాలని ఈసీని డిమాండ్ చేశారు.

ఆకట్టుకున్న బాబు బెంగాలీ ప్రసంగం

పశ్చిమ బంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు...ప్రసంగాన్ని బెంగాలీ భాషలో ప్రారంభించారు. ఆ ప్రాంత విశిష్టతలు, ప్రముఖుల స్మరణతో స్థానిక భాషలోనే మాట్లాడారు. చంద్రబాబు బెంగాలీ ప్రసంగం సభాస్థలిలో జోష్​ను నింపింది. జార్ గ్రామ్ మనుష్యకే ప్రనామ్ అంటూ మొదలైన చంద్రబాబు ప్రసంగం...వివిధ ఆసక్తికర అంశాలపై సాగింది.

ఇవీ చూడండి : ఎన్డీయేకు వ్యతిరేకంగా.. దిల్లీలో చంద్రబాబు మంతనాలు!

Intro:Ap_cdp_46_08_cricket_betting_mugguru arrest_AD_Av_c7
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.14,00,450లు స్వాధీనం చేసుకున్నారు. విషయాలను రాజంపేట డిఎస్పి మురళీధర్ విలేఖర్లకు తెలియజేశారు. ఓబులవారిపల్లె మండలం బొంత వారి పల్లి చర్చికి సమయంలో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల పై ఎస్సై మోహన్ పోలీస్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు వారి నుంచి నగర్ తో పాటు మూడు సెల్ఫోన్లు క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు పట్టుబడిన వ్యక్తుల్లో ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు దిగువ పల్లెకు చెందిన షేక్ మౌలానా, వెంకటరమణ, కటికంవారిపల్లి కి చెందిన నాగేంద్రలను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.


Body:క్రికెట్ బుకీ లు అరెస్ట్ రూ.14 లక్షలు స్వాధీనం


Conclusion:కడప జిల్లా రాజంపేట

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.