కోకాపేటలోని నటుడు చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో సైరా చిత్రం కోసం వేసిన సెట్టింగ్ మంటల్లో కాలిపోయింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఉవ్వెత్తున అగ్ని కీలుల ఎగిసి పడుతున్నందున తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: రాంపూర్ పంప్‌హౌస్ వద్ద అగ్నిప్రమాదం