వాడికి వావి వరసలు కూడా తెలియట్లేదు. వరుసకు చెల్లెల్లు.. అయినా ప్రేమించాలంటూ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఆమె అన్నలాంటి వాడివంటూ తిరస్కరించింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న ద్వేషంతో ఆ అమ్మాయిపైకి కత్తితో దాడికి దిగాడు.
అసలేం జరిగిందంటే...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన రమేశ్ అలియాస్ ఉమేశ్(26).. సొంత చిన్నాన్న కూతురినే ప్రేమిస్తున్నానంటూ మూడు నెలలుగా వెంటపడ్డాడు. అన్నా చెల్లెలి వరుస అయినందున ఆ యువతి ఒప్పుకోలేదు. అంతే అతని అసలు రూపం చూపించాడు. ఇవాళ ఒంటరిగా గుడికు వెళ్తున్న ఆమెను వెంబడించాడు రమేశ్. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కత్తితో దాడికి దిగాడు. గమనించిన స్థానికులు రమేశ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: