మొదటి రోజు తొమ్మిది గంటలు, రెండో రోజు 11 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. శారదా కుంభకోణం కేసులో రాజీవ్‌కుమార్, సాక్ష్యాధారాలు మాయం చేశారన్న అభియోగాలను మోపింది సీబీఐ. విచారణ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలన్న రాజీవ్ అభ్యర్థనకు సీబీఐ నిరాకరించింది.
శారదా కుంభకోణం కేసుకు సంబంధించి 2013లో కృనాల్‌ను అరెస్టు చేశారు. 2016 నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఈ కేసులో 12 మందితో పాటు భాజపా నాయకుడు ముకుల్ రాయ్ నిందితులుగా ఉన్నారు.
సీబీఐకి కేసు అప్పగించడానికి ముందు శారదా కుంభకోణంపై, రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరిపింది. కంపెనీ దివాలా తీసిన అనంతరం దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ బృందాన్ని నియమించారు.