ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ఇంటింటి ప్రచారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఎస్.వి.నగర్లో ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తన ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందన్న ఆమె... ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని అభిప్రాయపడ్డారు. తెదేపా కార్యకర్తలు ముందుండి తన ప్రచారం జోరుగా నడిపిస్తున్నారన్నారు. మళ్లీ తనదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి కారణమవుతాయని మంత్రి చెప్పారు.
ఇవీ చదవండి :తెరపైకి విజయ్ తమ్ముడు, రాజశేఖర్ కూతురు