కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. నల్లమల అటవీప్రాంతం నుంచి దారితప్పి..స్థానిక డిగ్రీ కాలేజీ సమీపంలో తచ్చాడుతూ కనిపించింది. ప్రజలు కేకలతో ఎటు వెళ్లాలో పాలుపోక..ఓ చెట్టెక్కి కూర్చుంది. అటవీశాఖ అధికారులు ఆ మూగజీవాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయం అయినందున గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
ఇవీ చదవండి...పావురాలకూ ఓ ఆఫీసు... అదెక్కడంటే!?