అనంతపురం కియా పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ కియా ప్రతినిధులకు సూచించారు. జిల్లాలోని పెనుగొండ మండలం ఎర్రమంచిలో నిర్మించిన కియా కార్ల పరిశ్రమను జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి మంత్రి శంకర నారాయణ సందర్శించారు. కార్ల ఉత్పత్తి, ఉద్యోగ కల్పన అంశాలపై కియా ప్రతినిధులతో మంత్రి చర్చించారు. భూనిర్వాసితులు కోరిక మేరకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : విశాఖ భూకుంభకోణం నివేదికను బయటపెట్టండి: కన్నా