ETV Bharat / briefs

ప్రకృతి సేద్యం మేటి... రెడ్డి కొట్టాలా సుబ్బారెడ్డి

రసాయనిక ఎరువులతోనే అధిక దిగుబడులు సాధ్యమనే అపోహలో ఉన్న కొంతమంది రైతులకు కడప జిల్లా రెడ్డి కొట్టాలా గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కనువిప్పు కల్పిస్తున్నారు. జీవ సేంద్రియ ఎరువులు వాడుతూ సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్యం సూచనలతో అధికదిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు.

ప్రకృతి సేద్యం మేటీ...రెడ్డి కొట్టాలా సుబ్బారెడ్డి
author img

By

Published : May 4, 2019, 8:03 AM IST

ప్రకృతి సేద్యం మేటీ...రెడ్డి కొట్టాలా సుబ్బారెడ్డి

రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు.. ప్రకృతి వ్యవసాయం లాభసాటి అని సుబ్బారెడ్డి ఆచరించి చూపుతున్నారు. అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకోవాలని సూచిస్తున్నారు. సుభాష్ పాలేకర్ అందించిన ప్రకృతి వ్యవసాయ సూచనలు పాటిస్తూ అరటి సాగులో సిరుల పంట పండిస్తున్నారు.

కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డి కొట్టాలా గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి అనే రైతు సేంద్రియ ఎరువులు, మందులు వాడుతూ అరటి సాగులో అధిక లాభాలు పొందుతున్నారు. సేంద్రియ ఎరువులు మాత్రమే వినియోగిస్తూ ఆరోగ్యానికి హానికరం లేని అరటిపండ్లు ఉత్పత్తి చేస్తున్నారు.

రెడ్డి కొట్టాలా గ్రామంలో తనకున్న ఎకరా పొలంలో అరటి పంట సాగు చేసిన సుబ్బారెడ్డి అధిక దిగుబడి సాధించారు. పంటకు రూ. లక్షన్నర మేర ఖర్చు అయితే రూ. 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం పొందుతున్నారు. క్రిమీ సంహారక, రసాయన ఎరువుల వాడకాన్ని మానేయడం వలన రూ.60 వేల పెట్టుబడి ఆదా అవుతుందటున్న రైతు... సేంద్రియ ఎరువుల వాడకంతోనే ఈ ఆదా అయ్యిందంటున్నారు.

ప్రకృతి సేద్యంలో మేటి
ప్రకృతి వ్యవసాయంతో పండిస్తున్న ఈ అరటిపండ్లకు మార్కెట్లో మంచి గిరాకి ఉందన్న సుబ్బారెడ్డి... ధర తక్కువగా ఉన్న సమయంలోనూ మంచి లాభాలు వచ్చాయంటున్నారు. పండ్ల నాణ్యత, రుచిగా ఉండడం వలన వ్యాపారులు తన పంటను తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు.

అరటి సాగులో జీవామృతం, ఘన జీవామృతం ఎరువులు, బిందుసేద్యం ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. ఈ ఎరువులతో అరటి చెట్లు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తున్నాయని రైతు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుంటే మంచి లాభాలను ఆర్జించవచ్చని...అందుకు తానే రుజువని సుబ్బారెడ్డి అంటున్నారు.

మొదట్లో శ్రీ వరి పంటను సాగు చేసి మంచి ఫలితాలు సాధించానని రైతు తెలిపారు. అరటి సాగు లాభాసాటితో ఈ వ్యవసాయానికి మారినట్లు తెలిపిన ఆయన ప్రకృతి సేద్యంతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. అరటి పంటకు ఆవు ఎరువు, మూత్రాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. వానపాముల వృద్ధి, సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా పొలం సారవంతంగా మారిందన్నారు.

ఇవీ చూడండి : ఫొనిపై ఆర్టీజీఎస్ అద్భుత సమాచారం అందించింది : ఒడిశా ప్రభుత్వం

Intro:Ap_Vsp_61_03_Directors_Day_Celebrations_Ab_C8

Body:దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని దర్శకుల దినోత్సవంగా జరుపుకోనున్నట్లు ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంక్షేమ సంఘం ఇవాళ విశాఖలో తెలిపింది దాసరి నారాయణరావు 72 వ జయంతిని రేపు విశాఖలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాద కుమార్ తెలిపారు నగరంలోని కళాభారతి ఆడిటోరియం వేదికగా నిర్వహించనున్న దర్శకుల దినోత్సవానికి ప్రముఖ దర్శకుడు వి వి సముద్ర ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు దాసరి నారాయణరావు అభిమానులు సినీ దర్శకులు నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు దర్శకుల దినోత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు
---------
బైట్: యాద కుమార్ ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.