
గుహవటిలోని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు మోదీ వెళుతున్న సమయంలో విద్యార్థి సంఘం సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ప్రధాని వాహనశ్రేణి గువహటి విశ్వవిద్యాలయం పరిసరాలకు చేరగానే నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. మోదీ గోబ్యాక్, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రద్దు చేయండి అంటూ నినదించారు.