విశాఖలో విద్యార్థులు, యువ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖిలో పాల్గొన్న లోకేశ్ రాష్ట్రాన్నిభారత్‌లోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖలో విద్యార్థులు, యువ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు.రాష్ట్రంలో యువతకు పెద్దసంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతోందన్న ఆయన.. రాబోయే ఐదేళ్లల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్టార్టప్ కంపెనీలు పెట్టేవిధంగా యువత ఎదగాలని సూచించిన నారా లోకేశ్.. అవసరమైన ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు వస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దిశగా 2019 ఎన్నికలు చాలా కీలకమని తెలిపారు.
ఇవి కూడా చదవండి:త్వరలో అనకాపల్లి ఆసుపత్రిలో పీజీ కోర్సులు