ETV Bharat / crime

Palvancha Family Suicide Case: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అరెస్టు - పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తాజా సమాచారం

vanama raghava
vanama raghava
author img

By

Published : Jan 6, 2022, 4:04 PM IST

Updated : Jan 6, 2022, 4:53 PM IST

16:02 January 06

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవపై ఆరోపణలు

Vanama raghava arrested: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లేఖ రాశారు. పాల్వంచ ఘటన తీవ్ర క్షోభకు గురి చేసిందన్నారు. తన కుమారుడిపై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రాఘవను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రాఘవను పోలీసులు కొత్తగూడెం తరలించినట్లు తెలుస్తోంది. రాఘవపై పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంచలనమైన సెల్ఫీ వీడియో..

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో అతని సెల్ఫీ వీడియో సంచలనమైంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.

సెల్పీ వీడియోలో..

రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్‌ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు' అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.

ఇదీ చదవండి

Last Updated : Jan 6, 2022, 4:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.