హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళిపై పవన్ అభిమానులు దాడికి యత్నించారు. వారిని పంజాగుట్టు పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పొసాని కృష్ణమురళి... ప్రెస్‌మీట్ పెట్టి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుని.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి యత్నించారు. ఆరుగురు పవన్ అభిమానులను అరెస్ట్ చేశారు. అయినా మరి కొంతమంది గుమికూడటంతో పోసానిని.. పోలీసులు తమ వాహనంలో ప్రెస్‌క్లబ్ నుంచి సురక్షితంగా తరలించారు.
'పవన్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు పవన్ కల్యాణే కారణం. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని తెలిపారు.' - పొసాని కృష్ణమురళి
చలన చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని.. పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు. పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్‌కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన పోసాని.. అభిమానులను పవన్ నియంత్రణలో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోసానిపై ఫిర్యాదు చేస్తాం
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను... తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఖండించారు. పోసానికి ఏమైనా ఇబ్బంది ఉంటే న్యాయపరంగా వెళ్లాలని... ఈ తరహాలో మాట్లాడడం సరికాదని ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలతో పాటు పవన్‌కల్యాణ్ అభిమానుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. పోసానిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలిరావడంతో హడావుడి నెలకొంది.
ఇదీ చదవండి: