ETV Bharat / bharat

రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. ప్రేమించడం లేదని రైలు కింద తోసేసి.. - ఝార్ఖండ్ క్రైమ్ న్యూస్

తల్లి పక్కనే నిద్రిస్తున్న రెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ పాశవిక ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ప్రేమను తిరస్కరించిందని ఓ యువతిని రైలు కింద తోసేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

rape
అత్యాచారం
author img

By

Published : Oct 13, 2022, 7:28 PM IST

మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని చందన్​నగర్​లో దారుణం జరిగింది. తల్లి పక్కన నిద్రిస్తున్న రెండేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బాధితురాలి తల్లి నిద్ర లేచే చూసేసరికి చిన్నారి కనిపించలేదు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రదేశంలోని చిన్నారి కనిపించింది. బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ట్రక్కు డ్రైవర్​గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రులు.. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి కాపలాగా ఉంటున్నారు.

ప్రేమను తిరస్కరించిందని..
తన ప్రేమను తిరస్కరించిందని యువతిని ఓ యువకుడు రైలు కింద తోసేశాడు. ఈ క్రమంలో బాధితురాలు మరణించింది. ఈ విషాద ఘటన తమిళనాడు చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో గురువారం జరిగింది.

girl hanging from tree
బాధితురాలు, నిందితుడు(పాత చిత్రం)

ఇదీ జరిగింది..
బాధితురాలి తండ్రి మాణిక్యం(47) పోలీసు కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె సత్య(20) టీనగర్​లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఆదంబాక్కంకు చెందిన సతీశ్(23) అనే యువకుడు సత్యను ప్రేమిస్తున్నాడు. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లేందుకు పరింగిమలై రైల్వే స్టేషన్​లో నిల్చొంది. అప్పడు అక్కడికి వచ్చిన సతీశ్.. సత్యతో గొడవకు దిగాడు. అనంతరం ఎదురుగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఈ క్రమంలో బాధితురాలు సత్య అక్కడికక్కడే మృతి చెందింది.

నిందితుడు సతీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సత్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు సతీశ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

మంత్రాలు చేస్తోందని వివస్త్రతను చేసి..
ఝార్ఖండ్​లో షాహిబ్​గంజ్​లో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తోందని 60 ఏళ్ల వృద్ధురాల్ని చెట్టుకు కట్టి.. వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. 20 రోజులు కిందట బర్​హైత్​​ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు రూ.21 వేలు చెల్లిస్తానని.. పంచాయతీ పెద్దలకు చెప్పడం వల్ల ఆమెను విడిచిపెట్టారు. బుధవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది గ్రామస్థులను పోలీసులు విచారించగా.. నిందితులు, బాధితురాలి కుటుంబం ఇరుగుపొరుగు వారని తెలిపారు. ఇరువురికి చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయని చెప్పారు.

ఇవీ చదవండి: ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన వీర శునకం మృతి

ఇంట్లో టీ తాగుతూ కూర్చున్న మైనింగ్ వ్యాపారి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.